ఇస్లాంలో ప్రవక్తత్వం
సర్వలోకాలను మరియు వాటిలోని ప్రతిదాన్నీ సృష్టించిన అల్లాహ్ మానవులను ఒక ఉత్తమ ఉద్దేశ్యంతో సృష్టించినాడు: అదేమిటంటే ‘కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఆయన యొక్క దివ్య బోధనలు మరియు మార్గదర్శకత్వాన్ని అనుసరించి సద్గుణాలతో కూడిన నైతిక జీవితం గడపాలి’. మరి, మానవులు ఆయన నుండి స్పష్టమైన మార్గదర్శకత్వం పొందకుండా దీనిని పూర్తి చేయలేరు కదా!
అంతేగాక, అత్యంత దయామయుడు మరియు న్యాయవంతుడైన అల్లాహ్ ఏ లక్ష్యం లేకుండా భూమిపై ఎలా పడితే అలా జీవించమని మనల్ని వదిలివేయలేదు. అందుకనే అల్లాహ్ మన జీవిత ఉద్దేశ్యాన్ని మనకు తెలిపేందుకు సమాజంలో నుండి కొందరు పుణ్యపురుషులను ఎంచకుని, వారిపై తన దైవవాణి అవతరింపజేసినాడు. దానిని స్వయంగా ఆచరించి మానవాళికి చూపమని వారిని ఆదేశించాడు.
ఆ పుణ్యపురుషులనే ప్రవక్తలు అంటారు, వారిలో కొందరి పేర్లు – ఆదమ్, నూహ్, అబ్రహామ్, మోసెస్, జీసస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్తల ప్రత్యేక లక్షణాలు ప్రవక్తలందరు కొన్ని కామన్ లక్షణాలు కలిగి ఉండేవారు. వాటి ద్వారా వారి కాలంలోని మానవులలో ప్రవక్తలు అసాధారణమైన వారిగా గుర్తించబడినారు.
ప్రవక్తలు దివ్యవాణి అందుకునేవారు సామాన్య మానవుడికి మరియు ప్రవక్తకు మధ్య గల ముఖ్యమైన భేదం ఏమిటంటే ప్రవక్తపై అల్లాహ్ నుండి దివ్యసందేశం అవతరిస్తుంది. ప్రవక్తలు ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేవారు ప్రవక్తలు సంపద, హోదా, అధికారం మొదలైన వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఎంతమాత్రమూ ప్రయత్నించేవారు కాదు.
కేవలం అల్లాహ్ ఆమోదం మరియు ప్రసన్నత పొందాలని మాత్రమే చూసేవారు. స్వభావం మరియు సద్గుణాలలో ప్రవక్తలను వారి ప్రజలు ఉత్తములుగా గుర్తించేవారు. వారు ఉత్తమ నైతిక ప్రవర్తన కలిగి ఉండి, ఎల్లప్పుడూ తమ పలుకులలో మరియు ఆచరణలలో సత్యవంతులుగా ఉండేవారు.
“• తన కాలపు అత్యంత దౌర్జన్యపరుడు, క్రూరుడైన ఫిరౌను చక్రవర్తి బారి నుండి ప్రజలను కాపాడిన మూసా అలైహిస్సలాం యొక్క సాటిలేని నాయకత్వం. • తన ప్రజలు పెట్టిన కష్టాలను మరియు హింసలను ఎంతో ఓర్పుతో సహించిన జీసస్ అలైహిస్సలాం యొక్క గొప్ప సహనశక్తి.
• ఎల్లప్పుడూ పరస్పర యుద్ధాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉండిన అరేబియా ద్వీపకల్పంలోని అనేక ప్రత్యర్థి తెగలను విజయవంతంగా ఒకే త్రాటిపై తీసుకు వచ్చి, ఒక ప్రశాంత సమాజాన్ని స్థాపించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప వివేకం.
ప్రవక్తల సందేశం “వాస్తవానికి మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము (ఆయన ఇలా ప్రకటించాడు): ‘మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు మిథ్యాదైవాల ఆరాధనను త్యజించండి.’ ఖుర్ఆన్ 16:36 మొత్తం ప్రవక్తలందరినీ ఏకైక నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యే పంపడం వలన, వారందరూ ఒకే సందేశాన్ని అందజేసారు.
ఇంకా, జీవిత ఉద్దేశ్యాన్ని తమ ప్రజలకు జ్ఞాపకం చేసే ఒకే మిషన్ కొరకు పనిచేసినారు. వారి ఆ దివ్యసందేశం మరియు మిషన్ ఏమిటంటే : • నిజమైన దైవభావన గురించి స్పష్టం చేయడం మరియు అసత్య విశ్వాసాలను తిరస్కరించడం. • నిజమైన జీవిత ఉద్దేశ్యాన్ని బోధించడం. • అల్లాహ్ ను ఎలా ఆరాధించాలో స్వయంగా ఆచరించి చూపడం.
• ప్రజలకు సుద్గుణ మరియు దుర్గుణ అంటే మంచి - చెడు స్వభావం గురించి అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అందజేయడం మరియు దాని గురించి ప్రజలకు ఉత్తమ సలహాలు ఇవ్వడం. • అల్లాహ్ కు విధేయత చూపడం వలన లభించే మంచి ప్రతిఫలం (స్వర్గం) గురించి వివరించడం మరియు అల్లాహ్ కు అవిధేయత చూపడం వలన ఎదుర్కోబోయే కఠిన శిక్షల (నరకం) గురించి హెచ్చరించడం.
• ఆత్మ, దైవదూతలు మరియు దయ్యాలు, పరలోక జీవితం మరియు విధివ్రాత మొదలైన విషయాలలోని అపార్థాలను దూరం చేయడం. “మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతి వారి భాషలోనే పంపాము.
అతను వారికి స్పష్టంగా బోధించటానికి …”ఖుర్ఆన్ 14:4 మొత్తం ప్రవక్తలందరు అసలు దైవభావన గురించి స్పష్టం చేయడంపైనే ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించేవారు: ఎవ్వరూ ఆయనకు సాటి లేరు, భాగస్వాములు లేరు, సమానులు లేరు. అరాధనలన్నీ కేవలం ఆయనకు మాత్రమే చెందుతాయి.
ప్రవక్తలు ఈ సందేశాన్ని అందజేసారనే ఉపమానాలు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి: ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఇలా పిలిచారు, “ఓ నా ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి! ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు.” [ఖుర్ఆన్ 7:59] ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పిలిచారు, “మీరు అల్లాహ్ ను వదలి, మీకెలాంటి లాభం గానీ నష్టం గానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?
” [ఖుర్ఆన్ 21:66] ప్రవక్త మూసా అలైహిస్సలాం ఇలా పిలిచారు, “ఏమీ! నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్య దైవాన్ని మీ కొరకు అన్వేషించాలా ? వాస్తవానికి ఆయనే సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు” [ఖుర్ఆన్ 7:140] ప్రవక్త జీసస్ అలైహిస్సలాం ఇలా పిలిచారు, “నిశ్చయంగా అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావును మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం.
” [ఖుర్ఆన్ 3:51] అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, “నిశ్చయంగా మీ ఆరాధ్యుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే నని నాపై దివ్యవాణి అవతరింపజేయబడింది. కాబట్టి తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా కల్పించుకోరాదు.
” [ఖుర్ఆన్ 18:110] ఇదే సందేశం తరతరాలుగా ఇవ్వబడింది. మరియు సృష్టికర్త పై సరైన దైవవిశ్వాసం కలిగి ఉండవలసిన ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పబడింది.
ఇస్లాం గురించి తెలుసుకోండి
సత్యాన్ని కనుగొనండి
మరింత తెలుసుకోండిసత్యం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి