షహాదహ్ – ఒక ముస్లిం యొక్క ధృవీకరణ
(అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు) ఇస్లాం స్వీకరించిన అనేక మంది ప్రజలు ఇస్లాం యొక్క మొట్టమొదటి మూలస్థంభమైన - లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ యొక్క అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క మహోన్నత వచనం యొక్క భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం: لا إلاه إالله محمد رسول الله
లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అనే పవిత్ర వాక్యాన్ని మూడు భాగాలలో అర్థం చేసుకోవచ్చును: a (మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం, నాలుగవ నియమం), b & c a) క్రింద తెలిపిన నాలుగు నియమాల పై సర్వలోకాల సృష్టకర్త, ఉనికిలో ఉన్న ప్రతి దానికి ప్రభువు, ఏకైక మహోన్నతుడు మరియు తీర్పుదిన న్యాయాధిపతి అయిన అల్లాహ్ కు మీరు వాగ్దానం చేయవలసి ఉన్నది.
మొదటి నియమం: “కేవలం అల్లాహ్ మాత్రమే ప్రతిదాని సృష్టికర్త” అని హృదయపూర్వకంగా అంగీకరించటం.
A confession with your heart that the Creator (of everything) is Allah; దీని కోసం మీరు ఇలా ధృవీకరించ వలసి ఉంటుంది: “నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, స్వర్గలోకాలు, ప్రపంచానికి తెలిసిన మరియు తెలియని అన్ని రకాల జీవరాశులతో నిండి ఉన్న భూలోకం మొదలైన సకల లోకాలను సృష్టించిన, సర్వలోక సమర్థుడు కేవలం అల్లాహ్ మాత్రమే” అని నేను సాక్ష్యమిస్తున్నాను.
ఆయనే ఈ విశాల విశ్వపు ప్రతిదీ నడిపేవాడు మరియు ప్లానింగ్ చేసేవాడు. ఆయనే జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు, మరియు కేవలం ఆయనే పోషిస్తాడు, సంరక్షిస్తాడు” దీనిని “అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్ అని అంటారు.
“అష్హదు అన్ - లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అనే పలుకులను తప్పనిసరిగా ఉచ్ఛరించ వలెను.
దీనికి ఆధారం తన పినతండ్రి అయిన అబు తాలిబ్ మరణశయ్య పై, చివరి ఘడియలలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పలికిన పలుకులు: “ఓ బాబాయి, నీవు గనుక అష్హదు అన్ - లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్ష్యమిచ్చినట్లయితే, తీర్పు దినమున నేను అల్లాహ్ దగ్గర నీ కోసం ప్రార్థించగలను.
” అలాగే, అబు ధర్ గఫ్ఫారీ రదిఅల్లాహుఅన్హు అనే అతను ఇస్లాం స్వీకరించిన తర్వాత మస్జిద్ అల్ హరాం దగ్గరకు వెళ్ళి, ఖురైషీయుల ఎదుట బిగ్గరగా షహాదా పవిత్ర వచనాన్ని ప్రకటించగా, వారు అతడిని విపరీతంగా కొట్టి, గాయపరచినారు. పెదవులతో పాటు శరీరాంగములన్నీ ఆ పవిత్ర వచనానికి సాక్ష్యం పలికి, ధృవీకరించటం తప్పని సరి.
దాని భావాన్ని (“అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను, ధృవీకరిస్తున్నాను”) మొత్తం శరీరాంగాలు పూర్తిగా అర్ధం చేసుకోవటం చాలా ఆవశ్యకమైన ముఖ్యవిషయం.
కాబట్టి దీనికి సమ్మతించిన వారెవరైనా సరే దోపిడి, దొంగతనం, హత్య, వ్యభిచారం, అక్రమసంబంధం, పంది మాంసం తినటం, మత్తుపానీయాలు సేవించటం, అక్రమ పద్ధతులలో సంపాదించటం, అనాధల ఆస్తిపాస్తులను అన్యాయం గా ఆక్రమించటం, వ్యాపార లావాదేవీ లలో మోసం చేయటం, లంచాలు ఇవ్వటం, అబద్ధాలు చెప్పటం వంటివి చేయకూడదు.
ఒకవేళ పవిత్ర వచనం పై సాక్ష్యం పలికీ, అటువంటి పాపపు పనులు చేసినట్లయితే, తీర్పు దినమున స్వంత శరీరావయవములే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. అంటే పవిత్ర వచనం పలకటం ద్వారా ఏదైతే అల్లాహ్ కు ప్రమాణం చేసాడో దానికి వ్యతిరేకంగా చేసేవాడని సాక్ష్యమిస్తాయి.
ఒకవేళ అతడు పైన తెలిపిన పాపపు పనులలో ఏదైనా చేసినట్లయితే, అతడు దానిని పాపపు పనిగా గ్రహించి, వెంటనే అల్లాహ్ దగ్గర పశ్చాత్తాప పడి, మన్నింపమని వేడుకోవలెను. చేసిన పాపపు పనులకు తన స్వంత శరీరావయలైన చర్మం, రహస్యాంగాలు, చేతులు, నాలుక, చేవులు తీర్పుదినాన స్వయంగా తనకే వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయనే విషయం తెలుసుకో వలెను.
ఎవరైనా సరే, ఈ పవిత్ర వచనాన్ని ధృవీకరించటంతోనే ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తారు. అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ విశ్వసించటం మరియు వారి మధ్య ఎటువంటి భేదాలు చూపకపోవటం అతడి పై తప్పని సరి అయిపోతుంది. ఖుర్ఆన్ (V.18:102-110) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఏమీ?
ఈ సత్యతిరస్కారులు నన్ను వదిలి, నా దాసులను (అంటే దైవదూతలను, అల్లాహ్ యొక్క సందేశహరులను, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా అలైహిస్సలాం, పుణ్యపురుషులు..) తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకోగలరని భావించారా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాము.” “ప్రకటించు: ‘కర్మలను బట్టి అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా?
’ “ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసేవన్నీ సత్కార్యాలే అని భావిస్తారో!” “వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి ఉన్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము పునరుత్థాన దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము.
“అదే వారి ప్రతిఫలం నరకం; ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు. “నిశ్చయంగా! ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారి ఆతిథ్యం కొరకు ఫిర్దౌస్ స్వర్గవనాలు (అత్యున్నత స్వర్గపు తోటలు) ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు.
వారితో అను: “నా ప్రభువు మాటలు వ్రాయటానికి సముద్రమంతా సిరాగా మారిపోయినా – నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే – దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా అది కూడా తరిగి పోతుంది.” (ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలాఅను: నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడినే.నాపై దివ్యజ్ఞానం అవతరింపజేయబడినది.
నిశ్చయంగా మీ ఆరాథ్యుడు ఆ ఏకైక ఆరాధ్య దైవం (అల్లాహ్) మాత్రమే. కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములు (షరీక్) గా కల్పించుకోరాదు.” ఎవరైనా ఇస్లాం స్వీకరించాలనుకుంటే, క్లుప్తంగా పైన తెలిపిన కనీస ఇస్లాం పరిచయ విషయాలు తప్పక చదవుకోవలెను.
షహాదా పవిత్ర వచనాలపై సాక్ష్యం పలికిన తర్వాత, ఇస్లామీయ పద్ధతిలో సంపూర్ణ తలస్నానం – గుసుల్ చేసి, రెండు రకాతుల నమాజు చేసి, ఆ తర్వాత ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాల ఆధారంగా జీవించటం మొదలు పెట్టవలెను.
ఇంకా సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనం లోని మొదటి హదీథ్ గ్రంథం 7వ హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన బోధనను ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు – ఇస్లాం ఐదింటిపై ఆధారపడి ఉన్నది: 1) లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని నేను సాక్ష్యమివ్వటం, ధృవీకరించటం.
2) నమాజు స్థాపించటం. 3) జకాతు– తప్పని సరి విధిదానం చెల్లించటం. 4) రమదాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండటం. 5) హజ్ చేయటం (i.e.మక్కా యాత్ర). ఇంకా అర్కాన్ అల్ ఈమాన్ అంటే విశ్వాసపు ఆరు సిద్ధాంతాలను కూడా నమ్మవలసి ఉంటుంది. అవి: 1. అల్లాహ్ పై విశ్వాసం 2. అల్లాహ్ యొక్క దైవదూతలపై విశ్వాసం 3. అల్లాహ్ యొక్క సందేశహరులపై విశ్వాసం 4.
అల్లాహ్ యొక్క గ్రంథాలపై విశ్వాసం 5. పునరుత్థాన దినం పై విశ్వాసం 6. అల్ ఖదర్ – జీవితంలో జరగబోయే మంచిచెడులను అల్లాహ్ ముందు గానే లిఖించి ఉంచాడనే నమ్మకం పై విశ్వాసం.
ముఖ్యగమనిక :- మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యాలు క్రింద తెలిపిన రెండు షరతుల ప్రకారం ఉంటేనే అల్లాహ్ దగ్గర స్వీకరించబడతాయి.: 1. అటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు కేవలం అల్లాహ్ స్వీకరణ కొరకు మాత్రమే చేస్తున్నట్లు దృఢసంకల్పం చేసుకోవలెను.
అందులో ఎటువంటి ప్రదర్శనాబుద్ధి, కీర్తి ప్రఖ్యాతుల తాపత్రయం, ఎవరినైనా మెప్పించటం కోసం చేసే ప్రయత్నం, స్వార్థం వంటివి ఉండకూడదు.
2. అటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడు మరియు దాసుడు అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నహ్ (ఇస్లామీయ ధర్మాదేశాలు, ఆచరణలు, అనుమతులు) ప్రకారం ఉండవలెను.
ఇస్లాం గురించి తెలుసుకోండి
సత్యాన్ని కనుగొనండి
మరింత తెలుసుకోండిసత్యం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి